కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబ దంపతుల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బ్రహ్మంగారి 411వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా మహానంది దేవాలయం నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. మఠం పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి దంపతులు... స్వామి కల్యాణాన్ని కన్నుల పండువగా జరిపించారు.
కన్నుల పండువగా వీరబ్రహ్మేంద్ర స్వామి కల్యాణోత్సవం - veerabrahmendra swamy marriage news
కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో వీరబ్రహ్మేంద్ర స్వామి కల్యాణోత్సవం నిర్వహించారు. దేవదాయ శాఖ పట్టువస్త్రాలు సమర్పించింది.
కన్నుల పండువగా వీరబ్రహ్మేంద్ర స్వామి కల్యాణోత్సవం