MPP Raghunatha Reddy Attack on Farmer : అన్యాయంపై ప్రశ్నించినందుకు, అక్రమాలను వెలికి తీసినందుకు తనపై వీరపునాయునిపల్లి ఎంపీపీ రఘునాథరెడ్డి దాడి చేశారని రైతు, అన్యాయంపై న్యాయపోరాటం చేస్తున్న నాగప్రసాద్ వాపోయాడు. తుపాకీతో బెదిరించి, అనుచరులతో కలిసి గాయపరిచాడని తెలిపాడు. వైఎస్సార్ జిల్లా వీరపునాయునిపల్లి మండలంలో ఎంపీపీ రఘునాథరెడ్డి, అతడి అనుచరులు సాగిస్తున్న అక్రమాలు అనేకం అని తెలిపాడు. ఆన్లైన్ ప్రక్రియను అడ్డం పెట్టుకుని, తహసీల్దార్‌తో కుమ్మక్కై గుట్టలు అన్యాక్రాంతం చేస్తున్నాడని, భూములు చెరబట్టారని వివరించాడు. ఇసుక అక్రమ రవాణా కుంభకోణం పెద్ద ఎత్తున సాగుతోందని చెప్పాడు. ఎంపీపీ హోదాలో అవినీతికి పాల్పడడంతో పాటు.. బొగ్గు బట్టీలు నడుపుతున్నాడని తెలిపాడు. ఈ మేరకు ప్రొద్దుటూరు సరోజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగప్రసాద్.. అవుట్ పోస్ట్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.
ఎంపీపీ కుంభకోణాలు వెలికితీస్తున్న తనపై.. హత్యాయత్నానికి పాల్పడ్డారు. గన్‌తో చంపడానికి ప్రయత్నించి.. దొరికిపోతాననే భయంతో రాడ్డుతో చంపాలని ప్రయత్నించారు. -నాగప్రసాద్, బాధితుడు