కడప జిల్లా రాజంపేట పట్టణంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో స్వామివారి ఆరాధనోత్సవాలు నిర్వహించారు. ఉదయం గోవిందమాంబ సమేత స్వామివారికి పంచామృత అభిషేకాలను శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం స్వామి, అమ్మవార్లను అందంగా అలంకరించారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆలయ ప్రధాన అర్చకుడు అరుణ్ కుమార్ స్వామి మాత్రమే పాల్గొని కార్యక్రమాన్ని ఎలాంటి ఆర్బాటం లేకుండా నిరాడంబరంగా పూర్తి చేశారు.
నిరాడంబరంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు - కడపలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వార్తలు
కడప జిల్లా రాజంపేటలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో స్వామివారి ఆరాధనోత్సవాలు నిరాడంబరంగా నిర్వహించారు.
వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు