ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు: వైభవంగా మహానైవేద్యం ఘట్టం - Veerabhadra Swamy Brahmotsavam in Kadapa district

కడప జిల్లా రాయచోటిలో శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు తెల్లవారుజామున అగ్నిగుండ ప్రవేశం, మధ్యాహ్నం మహానైవేద్య ఘట్టాలు కనులపండుగగా జరిగాయి. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.

Veerabhadra Swamy Brahmotsavam
వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు

By

Published : Mar 16, 2021, 5:49 PM IST

కడప జిల్లా రాయచోటిలో శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 8వ రోజు (మంగళవారం) తెల్లవారుజామున అగ్నిగుండ ప్రవేశం, మధ్యాహ్నం మహా నైవేద్య ఘట్టాలు అత్యంత వైభవంగా జరిగాయి. స్థానిక భక్తులే కాక.. కన్నడ, మహారాష్ట్ర నుంచి వేలాదిగా తరలివచ్చి మహానైవేద్యం ఘట్టాన్ని తిలకించారు. 11 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో స్వామివారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇస్తారు.

వివిధ రకాల పిండి వంటలతో చేసిన భోజనాన్ని స్వామివారికి ఎదురుగా రాసిగా పోసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. అనంతరం సంప్రదాయం ప్రకారం వడియరాజులు నైవేద్యం స్వీకరించగానే భక్తులు ఒక్కసారిగా నైవేద్యం కోసం ఎగబడ్డారు. భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పలువురు ప్రముఖులు, అధికారులు.. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details