Variety Vinayaka Idols: బంకమట్టితో 54 అడుగులు, 50కిలోల పచ్చి బఠానీలతో.. ఆకట్టుకుంటున్న పర్యావరణరహిత వినాయక విగ్రహాలు Variety Vinayaka Idols in Kadapa:వైయస్సార్ జిల్లాలో ఘనంగా వినాయక చవితి పండుగను జరుపుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 900 విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఒక్క కడప నగరంలోనే 450 విగ్రహాలను ఏర్పాటు చేశారు. వివిధ రకాల పందిళ్లు వేసి భారీ ఎత్తున వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఈ సారి ఇద్దరు వెరైటీ విగ్రహాలనుతయారు చేశారు.
Vinayaka Chavithi Celebrations in AP రాష్ట్రంలో వినాయక చవితి సందడి.. భక్తులకు కనువిందు చేస్తున్న బొజ్జ గణపయ్యలు
54 Feet Idol of Lord Ganesha was Made in Kadapa:ఎప్పటి మాదిరిగానే కడప నగరంలోని 47వ డివిజన్ కు సంబంధించిన వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఈ ఏడాది 54 అడుగుల ఎత్తు కలిగిన పర్యావరణరహిత వినాయక విగ్రహాన్ని తయారు చేశారు. వీరు విగ్రహానికి ఇనుప కడ్డీలు సంచి పట్టలు నీటిలో కరిగిపోయే రంగులను ఉపయోగించారు. దాదాపు 40 రోజులపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులతో రెండు లక్షల రూపాయలు వెచ్చించిపర్యావరణ రహిత వినాయక విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహాన్ని ఎక్కడా నిమజ్జనం చేయరు. ఫైర్ ఇంజన్ల ద్వారా సంచిపట్టాలకున్న రంగు పోయే విధంగా నీటిని చల్లుతారు. ఇలా చేయడం వల్ల పర్యావరణాన్ని కాపాడిన వారమవుతాం అని వారి ఉద్దేశం.
Vinayaka Chavithi Celebrations వినాయక చవితి వేళా.. సందడిగా మారిన మార్కెట్లు
Lord Ganesha Satue was Made from Green Peas:కడప పట్టణంలోని రవీంద్ర నగర్‌కు చెందిన కిషోర్ కుమార్ అనే వ్యక్తి ఈ ఏడాది కొత్తగా పర్యావరణ రహిత వినాయక విగ్రహాన్ని తయారు చేశారు. సుమారు 50 కిలోల పచ్చి బఠానీలతో విగ్రహాన్ని తయారు చేశారు. 20 రోజులపాటు సమయాన్ని వెచ్చించి పదిమంది కలిసి పచ్చి బఠానీలతో అత్యాధునికంగా విగ్రహాన్ని తయారు చేశారు. పచ్చి బఠానీల విగ్రహాన్ని చూసేందుకు ప్రజలు తరలి వస్తున్నారు. అందరూ వెరైటీ విగ్రహాలను తయారు చేస్తున్నాం తామెందుకు చేయకూడదని ఉద్దేశంతో కొత్తగా పచ్చి బఠానీలతో విగ్రహాన్ని తయారు చేశామని నీటిలో సులువుగా కరిగిపోతుందని పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ వెరైటీ విగ్రహాలను తయారుచేసి పర్యావరణ పరిరక్షణకు పాటుపడితే మన భవిష్యత్ తరాలు మరికొన్ని కాలాలపాటు పదిలంగా ఉంటాయి. లేదంటే పర్యావరణ కాలుష్యంతో సమస్యలు తప్పవని అన్నారు.
Kanipakam Varasiddhi Vinayakaswamy Brahmotsavam : కాణిపాకం వినాయక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దం..
Huge Ganesha Idol Installation in Kadapa NGO Colony:కడప ఎన్జీవో కాలనీలో ఎప్పటి లానే భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. చిన్న చౌక్, రాజీవ్ పార్కు ప్రాంతాలలో పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. వివిధ రంగులతో వివిధ ఆకృతులతో పెద్ద పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేశారు. వినాయక చవితి పండగ సందర్భంగా వివిధ ప్రాంతాలలో అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.