కడప జిల్లా వనిపెంట గురుకుల విద్యాలయంలో క్వారెంటైన్ కేంద్రం ఏర్పాటుపై ఆ ప్రాంత వాసులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. 22 గదులున్న విద్యాలయంలో 88 పడకల ఏర్పాటుకు అధికారులు నిర్ణయించారు. తమ ప్రాంతంలో క్వారెంటైన్ కేంద్రం ఏర్పాటు చేస్తే.. తమకు కరోనా సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు వారితో మాట్లాడినా ససేమిరా అన్నారు.
వనిపెంటలో క్వారెంటైన్ ఏర్పాటుపై స్థానికుల వ్యతిరేకత - vanipenta locals protest at gurukul school
తమ ప్రాంతంలో క్వారెంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే స్థానికులకు కరోనా సోకే అవకాశం ఉందంటూ వనిపెంట గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి గురుకుల విద్యాలయానికి వచ్చిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
క్వారంటీన్ ఏర్పాటుపై వ్యతిరేకిస్తున్న వనిపెంట స్థానికులు
TAGGED:
kadapa district latest news