ఎస్సీలపై ఎస్సీ అట్రాసిటీ కేసు నిలవదనే విషయం తెలియని యంత్రాంగం రాష్ట్రంలో ఉందని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. కడప జిల్లా లింగాల మండలంలో అత్యాచారానికి గురైన ఎస్సీ మహిళ కుటుంబానికి అండగా నిలవడానికి వెళ్లిన తనతోపాటు పార్టీ ఎస్సీ సెల్ నేతలపై.. అట్రాసిటీ కేసు పెట్టడాన్ని అనిత తీవ్రంగా తప్పుబట్టారు. ఎస్సీ మహిళకు జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపితే అక్రమ కేసులు పెడతారా అని అనిత ప్రశ్నించారు.
'ఎస్సీలపై ఎస్సీ అట్రాసిటీ కేసు నిలవదని తెలియదా..?' - vangalapudi anitha fires on ysrcp governements
కడప జిల్లా లింగాల మండలంలో అత్యాచారానికి గురైన ఎస్సీ మహిళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన తెదేపా ఎస్సీ సెల్ నేతలపై ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడాన్ని ఆ పార్టీ తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఖండించారు. ఎస్సీలపై ఎస్సీ అట్రాసిటీ కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు.
vangalapudi anitha fires on ysrcp government