కడప గాడి వీధికి చెందిన షెక్ ఇనాయతుల్లా మటన్ దుకాణం పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి అతని కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రపోయారు. అయితే ఇంటి తలుపులు వేసినప్పటికి గడియ వేయలేదు. అంతేగాక బీరువాకు తాళం వేసి తాళాలు బీరువాపైనే ఉంచాడు. రాత్రి ఇంట్లో దొంగలుపడి బీరువాలో ఉన్న 10 తులాల బంగారు నగలు, వెండి, రెండు లక్షల 23 వేల రూపాయల నగదు దోచుకెళ్లారు. సోమవారం తెల్లవారుజామున ఇంటి యాజమాని చూడగా బీరువా తెరిచే ఉంది. చోరీ జరిగినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కడపలో ఓ ఇంట్లో చోరీ.. నగలు, నగదు అపహరణ - theft case registrar kadapa two town police station
దొంగ చేతికి తాళాలు ఇవ్వడం అంటే బహుశా ఇదేనేమో.. తలుపులు మూసేశారు.. కాని గడియ వెయ్యలేదు. బీరువాకు తాళాలు వేశారు.. తాళాలు బీరువాపై ఉంచారు. ఇంకేముంది దొంగ ఎంచక్కా చోరీ చేసి ఉడాయించిన ఘటన కడప రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
కడపలో చోరీ.. నగలు, నగదు అపహరణ