వాల్మీకిని ఆదర్శంగా తీసుకోండి: కలెక్టర్ - valmiki jayanthi celebrations in kadapa
కడప జిల్లాలో వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. కడప నగరపాలక కార్యాలయం వద్ద నిర్వహించిన జయంతి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.
![వాల్మీకిని ఆదర్శంగా తీసుకోండి: కలెక్టర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4739643-458-4739643-1570966124002.jpg)
కర్నూలు జిల్లాలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు
కర్నూలు జిల్లాలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు
రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ అన్నారు. వాల్మీకి జయంతిని పురస్కరించుకుని కడప నగరపాలక కార్యాలయం ఎదుట ఉన్న వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రామాయణం అంటే వాల్మీకి... వాల్మీకి అంటే రామాయణం అనే నానుడి ప్రజల్లో నాటుకునిపోయిందని అన్నారు. వాల్మీకి కులస్తులకు సంబంధించి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని... వాటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.