కడపజిల్లా వేముల మండలంలో యురేనియం బాధిత గ్రామాల్లో అఖిలభారత ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ సభ్యులు పర్యటించారు. సంస్థ అధ్యక్షుడు భాస్కర్ రావు ఆధ్వర్యంలో పది మంది సభ్యులు స్థానికుల సమస్యలపై ఆరాతీశారు. కేకే కొట్టాల, కనంపల్లి, మబ్బుచింతలపల్లి గ్రామాల్లో పర్యటించి గ్రామస్థులతో మాట్లాడారు. యురేనియం కలుషితం వల్ల గ్రామస్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. గ్రామస్థులు, రైతులు పడుతున్న ఇబ్బందులపై ప్రభుత్వం దృష్టి సారించాలని సభ్యులు డిమాండు చేశారు.
యురేనియం బాధిత గ్రామాలను ప్రభుత్వం ఆదుకోవాలి - villages
కడప జిల్లాలో యురేనియం బాధిత గ్రామాల్లో అఖిలభారత ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ సభ్యులు పర్యటించారు.
యురేనియం