కడప శివారులోని భగత్ సింగ్ నగర్లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఇంట్లో కొంతకాలంగా మనస్పర్థలు కారణంగా వివాదాలు నెలకొన్నాయి. ఈ తరుణంలో రాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న నగేంద్రపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
తీవ్రంగా గాయాలైన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ అసుపత్రికి తరలించారు.