కడప జిల్లాలో గురువారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వెలిగల్లు ప్రాజెక్టు నిండడంతో అధికారులు గేట్లు ఎత్తి రెండు వేల క్యూసెక్కుల నీటిని దిగువన పాపాగ్ని నదికి విడుదల చేశారు. సుండుపల్లి మండలంలోని పింఛ ప్రాజెక్టు నుంచి 400 క్యూసెక్కుల నీటిని దిగువన బాహుదా నదికి విడుదల చేశారు. నదీ పరివాహక ప్రాంత గ్రామాల వారిని నీటిలో దిగవద్దని హెచ్చరికలు జారీ చేశారు.
rains in kadapa : జిల్లాలో ఎడతెరపిలేని వర్షాలు..అలుగుపారుతున్న చెరువులు...
కడప జిల్లాలో గురువారం తెల్లవారుజాము నుంచి వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
జిల్లాలో ఎడతెరపిలేని వర్షాలు..అలుగుపారుతున్న చెరువులు...
రాయచోటి సమీపంలోని సర్దికూళ్ల వంక ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గున్నికుంట్ల రోడ్డులోని ఇనాత్ ఖాన్ చెరువు అలుగు ఉత్తుంగ ప్రవహించడంతో రవాణా నిలిచిపోయింది. అటుగా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారుడు అదుపు తప్పి పడిపోయాడు.. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు..స్థానికుల సహాయంతో అతన్ని ఒడ్డుకు చేర్చారు. దాంతో ప్రాణాపాయం తప్పింది.
ఇదీ చదవండి : RED SANDEL: ఎర్ర చందనం దుంగలు స్వాధీనం.. ఇద్దరు అరెస్టు