కడప జిల్లా ముద్దనూరు మండలం యామవరం కొండల్లో ఓ యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడా ? లేకుంటే హత్యచేశారా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం కాలిపోయి ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తం ఆవుతున్నయి. కడప నుంచి వచ్చిన డాగ్ స్క్వాడ్ , క్లూస్ టీం పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహం గురించి కనీసం ఒక సమాచారం కూడా లేకపోవడంతో పోలీసులకు సవాలుగా మారింది. వీలైనంత త్వరలోనే ఈ కేసు దర్యాప్తు పూర్తి చేస్తామని ముద్దనూరు సీఐ హరినాథ్ తెలిపారు.
కొండలో యువకుడి మృతదేహం..హత్యా? ఆత్మహత్య ? - unidentified dead body in mudhunuru
కడప జిల్లా ముద్దనూరు మండలం యామవరం కొండల్లో గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభించింది. ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడా ? లేకుంటే హత్యచేశారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కొండలో యువకుడి మృతదేహం