ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇళ్ల ముందు మురుగునీరు.. పట్టించుకోని అధికారులు - కడపలో మురుగునీటి సమస్య

భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా పాడవటంతో మురికినీరు ఇంటిముందు నిలిచిపోయింది. అటుగా వెళ్లాలంటే స్థానికులకు నరకప్రాయమే. అధికారులకు చెపితే పరిధి కాదని తప్పించుకుంటున్నారు.ఇదీ కడప జిల్లాలోని వివేకానంద నగర్ కాలనీ వాసుల పరిస్థితి.

under drainage system damaged  people facing problems
డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు

By

Published : Dec 14, 2019, 5:16 PM IST

మురుగునీటితో ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు
కడప జిల్లాలోని వివేకానంద నగర్​లో సుమారు వందల సంఖ్యలో నివాసాలు ఉన్నాయి. ఇక్కడ దాదాపు పదేళ్ల క్రితం భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల కిందట డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడం వల్ల మురుగు నీరు బయటికు వస్తోంది. నివాసాల ఎదుట మురుగు నీరు నిల్వ ఉండడం వల్ల స్థానికులు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. దోమలు, దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నాురు. నగరపాలక అధికారుల దృష్టికి తీసుకెళ్తే తమ పరిధి కాదు వేరే అధికారులకు ఫోన్ చేయాలి అంటూ నిర్లక్ష్య సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చూడండి

ABOUT THE AUTHOR

...view details