ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

missing case: వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు అదృశ్యం - కడప జిల్లా వార్తలు

కడప పోలీస్​స్టేషన్​ పరిధిలో రెండు వేర్వేరు సంఘటనల్లో ఓ వివాహిత, ఇంటర్మీడియట్​ విద్యార్థిని అదృశ్యమయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

missing case
అదృశ్యమైన వివాహిత

By

Published : May 29, 2021, 3:19 PM IST

కడప పోలీస్ స్టేషన్ పరిధిలో వేర్వేరు సంఘటనల్లో ఓ వివాహిత, ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి కనిపించకుండా పోయారు. జిల్లాలోని రవీంద్రనగర్​కు చెందిన వివాహిత తన ముగ్గురు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. బంధువులు ఆమె కోసం వెతికినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అదే ప్రాంతానికి చెందిన ఇంటర్మీడియట్​ విద్యార్థిని ఈ నెల 25వ తేదీన ఇంటి నుంచివెళ్లి.. ఈ రోజు వరకూ తిరిగి రాలేదు. అమ్మాయి తల్లిదండ్రులు.. బంధువులు, స్నేహితులను ఆరా తీసినా ఫలితం లేకపోయింది. అదృశ్యమైన వ్యక్తుల బంధువులు, తల్లిదండ్రుల నుంచి రెండు ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు…. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details