కడప జిల్లా రామాపురం మండలం చిట్లూరు వద్ద కర్నూలు - చిత్తూరు జాతీయ రహదారిపై మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. రాయచోటి పట్టణం జగదాంబ సెంటర్, శివ రామాలయం వీధికి చెందిన శైలేంద్ర కుమార్ (20), పవన్ కుమార్ (22)లు ద్విచక్రవాహనంపై కడపకు వెళ్లి పని ముగించుకుని తిరుగు ప్రయాణంలో రాయచోటి వస్తుండగా చిట్లూరు వద్ద ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును అధిగమిస్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన బొలెరో వాహనాన్ని.. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం వేగంగా ఢీకొంది.
వాహనాన్ని అధిగమించబోయారు.. ప్రాణాలు కోల్పోయారు - accident on kadapa chittoor highway
కడప జిల్లాలోని చిట్టూరు దగ్గర జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ద్విచక్ర వాహనంపై ఆర్టీసీ బస్సును అధిగమించబోయి ముందుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొన్నారు. యువకులు శిరస్త్రాణం ధరించి ఉంటే మృతిచెందేవారు కాదని ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు పేర్కొన్నారు.
వాహనాన్ని అధిగమించబోయారు.. ప్రాణాలు కోల్పోయారు
ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న యువకులు ఇద్దరూ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. యువకులు శిరస్త్రాణం ధరించి ఉంటే ప్రాణాలు పోయేవి కాదని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గుర్తించారు. పిల్లలు మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని రోధించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాలను లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రామాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:అనిశా వలకు చిక్కిన విద్యుత్ ఏఎల్‌ఎం