కడప జిల్లా రాయచోటిలోని మహమ్మద్ పుర వీధికి చెందిన మహమ్మద్ షఫీ అనే వ్యక్తి కొరియర్ సర్వీస్ నిర్వహిస్తున్నాడు. చెన్న ముక్కపల్లికి చెందిన సాయికిరణ్ రెడ్డికి ఓ పార్సిల్ రావటంతో...మహమ్మద్ షఫీ ఫోన్ చేసి పార్సిల్ తీసుకెళ్లమని చెప్పాడు. తన స్నేహితుడు వంశీరెడ్డీతో కొరియర్ కార్యాలయానికి వచ్చిన సాయికిరణ్ రెడ్డి... షఫీతో గొడవ పెట్టుకున్నాడు. తమ పార్సిల్ ఇంటికి ఎందుకు తెచ్చి ఇవ్వలేదని వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య మాట మాట పెరగి... షఫీపై ఇద్దరూ దాడి చేసినట్టు పట్టణ సీఐ రాజు తెలిపారు. తీవ్రంగా గాయపడిన షఫీని ప్రభుత్వ తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు.
పార్శిల్ ఇంటికి తెచ్చివ్వలేదని కొరియర్ నిర్వహకుడిపై యువకుల దాడి - కడప జిల్లా తాజా వార్తలు
కడప జిల్లా రాయచోటిలో ఓ ప్రైవేట్ కొరియర్ నిర్వహకుడిపై ఇద్దరు యువకులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితున్ని అస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు.
కొరియర్ నిర్వహకుడిపై ఇద్దరు యువకుల దాడి