కడప జిల్లా పుల్లంపేట మండలంలో విషాదం జరిగింది. పుల్లారెడ్డిపల్లికి చెందిన శివకుమార్, వెంకటాద్రి, రిషి ఈతకు వెళ్లి నీళ్లలో మునిగి మృతి చెందారు. స్థానికులు వారిని కాపాడే ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది.
కడప జిల్లాలో విషాదం..: ఈతకు వెళ్లి ముగ్గురు మృతి... - kadapa three died in swim
కడప జిల్లాలో విషాదం జరిగింది. ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు యువకులు, ఓ బాలుడు ఉన్నాడు. వారి తల్లిదండ్రుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి.
three died in swim
శివకుమార్, వెంకటాద్రి బీ ఫార్మసీ చదువుతుండగా.. రిషి ఆరో తరగతి చదువుతున్నాడు. వారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికొచ్చిన కుమారులు శాశ్వతంగా వదిలి వెళ్లారంటూ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాజంపేట ప్రభుత్వాసుత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:ఈజీఎస్ నిర్వాకం: బయట బతికే ఉన్నాడు.. రికార్డుల్లో చంపేశారు!