ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యనమలచింతలో విషాదం..నదిలో పడి ఇద్దరు యువకులు మృతి - chitravati river

యనమలచింతల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పీర్ల ఉత్సవాలు చూసేందుకు గ్రామానికి వచ్చిన ఇద్దరు యువకులు చిత్రావతి నదిలో పడి మృతి చెందారు.

చిత్రావతి నదిలో పడి ఇద్దరు యువకులు మృతి

By

Published : Sep 24, 2019, 6:48 PM IST

చిత్రావతి నదిలో పడి ఇద్దరు యువకులు మృతి

కడప జిల్లా కొండాపురం మండలంలోని యనమలచింతల గ్రామంలో ప్రమాదం చోటు చేసుకుంది. పీర్ల ఉత్సవాలు చూసేందుకు గ్రామానికి వచ్చిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు చిత్రావతి నదిలో పడి మృతి చెందారు. మృతుల్లో తాడిపత్రి మండలం చాగళ్లకు చెందిన బాబావల్లి (26), కొండాపురం మండలం యనమలచింతలకు చెందిన అన్వర్ బాషా (14) ఉన్నారు. ఇటీవల కాలంలో జమ్మలమడుగు ప్రాంతంలోని పెన్నానదిలో జరిగిన ఘటనల్లో... ముగ్గురు యువకులు మృతి చెందారు. వరుస ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details