ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Murder: కడప జిల్లాలో ఇద్దరు మహిళల దారుణ హత్య..పాతకక్షలేనా..! - కడప జిల్లా నేర వార్తలు

కడప జిల్లాలో ఇద్దరు మహిళల దారుణ హత్య
కడప జిల్లాలో ఇద్దరు మహిళల దారుణ హత్య

By

Published : Aug 6, 2021, 3:11 PM IST

Updated : Aug 6, 2021, 5:02 PM IST

15:09 August 06

కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో ఇద్దరు మహిళలు దారుణ హత్య

కడప జిల్లా బ్ర‌హ్మంగారిమ‌ఠం మండ‌లం డి.నేల‌టూరులో అంజ‌న‌మ్మ‌, లక్ష్మీదేవి అనే ఇద్దరు మహిళలు దారుణహ‌త్య‌కు గుర‌య్యారు. పాత క‌క్ష‌లతో హ‌త్య‌లు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. వ‌ర‌క‌ట్న వేధింపులతో అంజనమ్మ కోడలు చరిష్మా 2019లో హ‌త్యకు గురైంది. అప్పట్లో చరిష్మా త‌ల్లిదండ్రులు.. అంజనమ్మ, ఆమె కుమార్తె లక్ష్మీదేవిపై కేసు పెట్టారు. అత్తింట్లోనే చరిష్మా మృతదేహాన్ని సమాధి క‌ట్టించారు. అయితే హ‌త్య కేసులో బెయిల్​ రావడంతో అంజ‌న‌మ్మ‌, లక్ష్మీదేవి.. తిరిగి గ్రామానికి వెళ్లలేక బ్ర‌హ్మంగారిమ‌ఠంలో నివాసముంటున్నారు. 

నేలటూరులో ఉంటున్న తన తల్లిని చూసేందుకు అంజనమ్మ, కుమార్తె లక్ష్మీదేవి.. మనవడుతో కలిసి గ్రామానికి వెళ్లింది. సమాచారం తెలుసుకున్న ప్రత్యర్థులు త‌ల్లీకూతుళ్లను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ప్ర‌తీకార చ‌ర్య‌లో భాగంగానే హ‌త్య చేసి ఉంటార‌నే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. చరిష్మా సమాధి వద్దనే హత్యకు గురయ్యారు. సమాచారం అందుకున్న డీఎస్పీ బి.విజయ్‌కుమార్‌, సీఐ బీవీచలపతి, ఎస్సై శ్రీనివాసులు గ్రామానికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 

ఇదీ చదవండి..

Accident: లారీ, కారు ఢీ.. ఐదుగురు మృతి

Last Updated : Aug 6, 2021, 5:02 PM IST

ABOUT THE AUTHOR

...view details