కడప శివారులోని రాయచోటి రైల్వే వంతెన వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు వేగంగా ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం కడప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురికి హెల్మెట్ లేకపోవడంతోనే బలమైన గాయాలయ్యాయని రైల్వే పోలీసులు తెలిపారు. తీవ్ర రక్తస్రావం కావడంతో వారిని స్థానికులు హుటాహుటీన రిమ్స్‌కు తరలించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు.. - కడప జిల్లా తాజా వార్తలు
ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు వేగంగా ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కడప శివారులోని రాయచోటి రైల్వే వంతెన వద్ద జరిగింది. హెల్మెట్ లేకపోవడంతోనే బలమైన గాయాలు తగిలాయని.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని రైల్వే పోలీసులు తెలిపారు.
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ ముగ్గురుకి తీవ్ర గాయాలు