మాజీమంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ 104వ రోజు కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. హత్య కేసు నిందితుడు ఉమాశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు మూడో రోజు కస్టడీలో విచారిస్తున్నారు. ఆయుధాల గుర్తింపు కోసం అతన్ని సుదీర్ఘంగా ప్రశ్నించడంతో పాటు... కీలక సమాచారం రాబట్టనట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు అనుమానితులు సీబీఐ విచారణకు హాజరయ్యారు. సింహాద్రిపురం మండలం సుంకేశుల గ్రామానికి చెందిన సోమశేఖర్ రెడ్డి, పులివెందులకు చెందిన వెంకటనాథ్ రెడ్డిలు సీబీఐ విచారణకు హాజరయ్యారు. నాలుగు రోజుల కస్టడీ అనంతరం ఉమాశంకర్ రెడ్డిని రేపు పులివెందుల కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.
YS VIVEKA MURDER : విచారణకు ఇద్దరు అనుమానితులు హాజరు - Venkatnath Reddy
వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ 104వ రోజు కొనసాగుతోంది. సింహాద్రిపురం మండలం సుంకేశుల గ్రామానికి చెందిన సోమశేఖర్ రెడ్డి, పులివెందులకు చెందిన వెంకటనాథ్రెడ్డిలు సీబీఐ విచారణకు హాజరయ్యారు.
విచారణకు ఇద్దరు అనుమానితులు హాజరు