కడప-తాడిపత్రి మార్గంలో ఇద్దరు దొంగలు అరెస్ట్ - latest chori cases in kadapa
కడప- తాడిపత్రి మార్గంలో ఇద్దరు దొంగలను కడప సెంట్రల్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరివద్ద నుంచి 23 సెల్ ఫోన్లు, ఒక జత కమ్మలు స్వాధీనపరచుకున్నారు.వీరు రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు.
కడప-తాడిపత్రి మార్గంలో ఇద్దరు దొంగలు అరెస్ట్
కడప సెంట్రల్ క్రైమ్ పోలీసులు ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి 2.50 లక్షలు విలువ చేసే 23 సెల్ ఫోన్లను, ఒక జత కమ్మలను స్వాధీనపరచుకున్నారు. అరెస్ట్ అయిన వారిని పోలీసులు మీడియా ఎదుట హాజరు పరిచారు. జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మస్తాన్, రామ్లు రాత్రి వేళల్లో నివాసంలో చోరీలకు పాల్పడేవారు. సెల్ ఫోన్లు, బంగారు నగలు దొంగలించే వారు. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై సీసీఎస్ పోలీసులు నిఘా ఉంచి కడప-తాడి పత్రి మార్గంలో అరెస్ట్ చేశారు.