ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పక్కా సమాచారంతో ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్ - ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న రైల్వే కోడూరు అటవీ సిబ్బంది

ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను రైల్వే కోడూరు అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 50 వేల రూపాయల విలువైన నాలుగు దుంగలను.. కడప జిల్లా మట్లకోన ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నామని ఎఫ్ఆర్వో నయూమ్ ఆలీ వెల్లడించారు. నిందితులను తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించామని పేర్కొన్నారు.

red sandal logs along with smugglers
అధికారులు పట్టుకున్న ఎర్రచందనం దుంగలు, స్మగ్లర్లు

By

Published : Oct 29, 2020, 4:44 PM IST

అక్రమంగా తరలిస్తున్న నాలుగు ఎర్రచందనం దుంగలతో పాటు.. తమిళనాడుకు చెందిన ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు రైల్వేకోడూరు అటవీశాఖ అధికారులు తెలిపారు. కడప జిల్లా కె.వి.బావి పరిధిలోని మట్లకోన వద్ద నిందితులను పట్టుకున్నట్లు ఎఫ్ఆర్వో నయూమ్ ఆలీ వెల్లడించారు. 125 కేజీల బరువున్న దుంగల విలువ.. ప్రభుత్వ లెక్కల ప్రకారం 50 వేల రూపాయలు ఉంటుందని స్పష్టం చేశారు.

డీఎఫ్​వో ఆదేశాలతో సబ్ డీఎఫ్​వో, కోడూరు అటవీ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించామని నయూమ్ తెలిపారు. నిందితులు తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నమలై జిల్లాకు చెందిన వ్యక్తులుగా గుర్తించామన్నారు. వారి వద్ద నుంచి సెల్​ఫోన్​లు, వంట సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details