ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతంతో ఇద్దరు యువకులు మృతి - vempalle latest news

సరదాగా చేపలు పట్టేందుకు ఇద్దరు యువకులు నదికి వెళ్లారు. చేపలు పడుతుండగా నదిలో వ్యవసాయ బోరు కోసం తీసుకున్న విద్యుత్ వైర్లు.. వాళ్ల పాలిట శాపంగా మారాయి. విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటన కడప జిల్లాలో జరిగింది.

current shock in vempalle
వేంపల్లెలో విద్యుదాఘాతంలో ఇద్దరు యువకులు మృతి

By

Published : Mar 6, 2021, 9:04 PM IST

కడప జిల్లా వేంపల్లెలో విద్యుదాఘాతంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు మంగపట్నం మహేష్ (20), పఠాన్ అమీర్ ( 21) గా గుర్తించారు.

సరదా కోసం వేంపల్లె సమీపంలోని పాపాఘ్ని నదిలో చేపలు పట్టుకునేందుకు యువకులు వెళ్లారు. నదిలో వ్యవసాయ బోరు కోసం తీసుకున్న విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో వేంపల్లె, ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. మృతి చెందిన యువకులు కూలీ పనులు చేసుకుని జీవనం సాగించేవారిగా గుర్తించారు.

ఇదీ చదవండి

రూ.200 కోసం ఘర్షణ.. వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details