ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆయిల్​ ట్యాంకర్​ను ఢీకొన్న ద్విచక్రవాహనం.. ఇద్దరు మృతి - రామాజంనేయపురం వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ద్విచక్రవాహనంపై వెళ్తూ.. ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్​ను ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కడప శివారు రామాంజనేయపురం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో.. మస్తాన్, శ్రీకాంత్ అనే వడ్రంగు​లు దుర్మరణం పాలయ్యారు.

road accident in ramanjaneyapuram
రామాంజనేయపురం వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

By

Published : Mar 1, 2021, 7:03 AM IST

కడప శివారులోని రామాంజనేయపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో.. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. వడ్రంగి పనిచేసే మస్తాన్, శ్రీకాంత్​ ద్విచక్రవాహనంపై సిద్ధవటం వైపు వెళ్తూ.. ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్​ను ఢీకొట్టారు.

మద్యం సేవించి వస్తున్న వ్యక్తిని తప్పించబోయి వారు ప్రమాదానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలమంతా తీవ్ర రక్తస్రావమైంది. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం పోలీసులు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details