ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బద్వేలులో తనిఖీలు... రూ.16 లక్షలు పట్టివేత

By

Published : Apr 7, 2021, 10:11 PM IST

కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఓటర్లకు నగదు పంచేందుకు వెళ్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వాళ్ల నుంచి రూ. 16 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రమేశ్ బాబు తెలిపారు.

two persons arrested due to distribute cash to voters
నగదు పంచేందుకు వెళ్తున్న ఇద్దరు అరెస్ట్

కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఓటర్లకు నగదు పంచేందుకు వెళ్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వాళ్లనుంచి రూ. 16 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గోపవరం మండలంలో వెంగల్ రెడ్డి రమణారెడ్డి అనే వ్యకిని తనిఖీలు చేయగా రూ. 13 లక్షల నగదు పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు.

'నగదు గురించి ఆరా తీయగా గుత్తేదారు ప్రసాద్​రెడ్డి ఇంటి నుంచి తెస్తున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలో ప్రసాద్ రెడ్డి ఇంట్లో తనిఖీ చేయగా మరో రూ.3 లక్షలు దొరికాయి. ఈ కేసులో మొత్తం రూ.16 లక్షలు స్వాధీనం చేసుకొని రమణారెడ్డిపై కేసు నమోదు చేశాం. ప్రసాద్ రెడ్డిపై కూడా చర్యలు తీసుకుంటాం' అని సీఐ రమేశ్ బాబు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details