కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద ఉన్న ఇద్దరిని సిబ్బందితో కలిసి ఎస్సై నరసయ్య అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,46,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు మీడియా సమావేశంలో డీఎస్పీ సుధాకర్ వెల్లడించారు. నిందితులు.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన వెంకటగిరి రాజా, వెంకటగిరి మోహన్‌గా గుర్తించారు. వీళ్లపై గతంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నగదు అపహరణ కేసు నమోదైనట్లు డీఎస్పీ తెలిపారు.
నగదు అపహరణకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్ - kadapa latest news
నగదు అపహరణకు పాల్పడుతున్న ఇద్దరిని కడప జిల్లా ప్రొద్దుటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి రూ. లక్షా 46 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ సుధాకర్ వెల్లడించారు.
నగదు అవహరణకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్