కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం నల్లగుట్టపల్లెలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన రైతు భాస్కర్ నాయుడు గ్రామ సమీపంలోని వేరుశనగ పంటను అడవి పందుల నుంచి కాపాడుకునేందుకు విద్యుత్ తీగలు కంచెకు అమర్చాడు. మరుసటి రోజు పొలానికి వెళ్లిన భాస్కర్ నాయుడు ప్రమాదవశాత్తు తీగలు తగిలి మృతి చెందాడు. అదే గ్రామానికి చుట్టంగా వచ్చిన శాంతి అనే మహిళ పొలం వైపు వెళ్లి తీగలు తగిలి మృతి చెందింది. మృతదేహాల వద్ద కుటింభీకులు విలపిస్తున్న ఘటన అందరిని కలిచివేసింది. విషయం తెలుసుకున్న లక్కిరెడ్డిపల్లి సీఐ యుగంధర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద కారణాలపై ఆరా తీశారు. మృతదేహాలు పరిశీలించి శవ పరీక్ష నిమిత్తం లక్కిరెడ్డిపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలను తెదేపా మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, వైకాపా నేతలు పరామర్శించారు.
నల్లగుట్టపల్లిలో విషాదం.. విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి - two peoples died with current Shock at nallaguttapalli
కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం నల్లగుట్టపల్లెలో విషాదం చోటుచేసుకుంది. భాస్కర్ నాయుడు అనే రైతుకు పొలంలోని విద్యుత్ తీగలు తగిలి ప్రమాదవశాత్తు అక్కడికక్కడే మృతి చెందాడు. అదే గ్రామానికి చుట్టంగా వచ్చిన శాంతి అనే మహిళ మృత్యువాత పడింది.
నల్లగుట్టపల్లిలో విషాదం.. విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి
TAGGED:
విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి