కడప ప్రధాన రహదారిలో ఉన్న ఇళ్ల సిద్దయ్యపల్లి గ్రామ సమీపంలో పిక్కల గురుప్రసాద్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతనితో వివాహేతర సంబంధం ఉన్న మహిళ కూడా ఆత్మహత్య చేసుకుంది. ముద్దనూరు పట్టణానికి చెందిన గురుప్రసాద్ బేల్దారి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనితోపాటు పనులకు వచ్చే వివాహితతో గురుప్రసాద్కు వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు వివాహం చేస్తామని మందలించటంతో... మనస్తాపానికి గురైన గురుప్రసాద్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న వివాహిత సైతం ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివాహేతర సంబంధం.. పురుగుల మందు తాగి ఇద్దరూ ఆత్మహత్య - కడపలో పురుగులమందు తాగి ఇద్దరు వ్యక్తులు మృతి
కడప జిల్లా ప్రధాన రహదారి మార్గంలో ఉన్న సిద్దయ్యపల్లి గ్రామ సమీపంలో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టకున్న మహిళ కూడా ఆత్మహత్యకు పాల్పడింది.
పురుగులమందు తాగి ఇద్దరు వ్యక్తులు మృతి