ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

EXTRAMARITAL AFFAIR: వివాహేతర సంబంధంతో ఇద్దరు ఆత్మహత్య - కడప జిల్లాలో వివాహేతర సంబంధంతో ఇద్దరు ఆత్మహత్య

EXTRAMARITAL AFFAIR: కడపజిల్లాలోని నందివాండ్లపల్లె గుట్టల్లో వివాహేతర సంబంధంతో ఇద్దరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

EXTRAMARITAL AFFAIR
EXTRAMARITAL AFFAIR

By

Published : Dec 15, 2021, 9:49 PM IST

TWO IN EXTRAMARITAL AFFAIR COMMITTED SUICIDE: కడపజిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం నందివాండ్లపల్లె గుట్టల్లో ఇద్దరు ఆత్మహత్యకు చేసుకున్నారు. వేంపల్లెకు చెందిన యువకుడు(21), వివాహిత(35) ఇద్దరూ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. నందివాండ్లపల్లెకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండగుట్టల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని పోలీసులు తెలిపారు.

ఇరువురు ద్విచక్ర వాహనంపై లక్కిరెడ్డిపల్లికి వచ్చి... అక్కడి నుంచి నందివాండ్లపల్లెకు రోడ్డు మార్గాన అడవిలోకి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు మృతుల బంధువులు ఇచ్చిన సమాచారంతో.. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంధువులు కూడా ఇరువురి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిపారని లక్కిరెడ్డిపల్లె పోలీసులు చెప్పారు.

మృతురాలికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉండగా.. నాగేంద్రకు ఇంకా పెళ్లి కాలేదని తెలుస్తోంది. ఇద్దరి మధ్య చాలా రోజుల నుంచి వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసు విచారణలో తేలింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:Bus Accident: ప్రమాదానికి గురైన మరో ఆర్టీసీ బస్సు..అదుపుతప్పి కాల్వలోకి

ABOUT THE AUTHOR

...view details