కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఈ రోజు రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 13న చెన్నై నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన వలస కూలీలు రెండు లారీల్లో రాగా రైల్వేకోడూరు కుక్కలదొడ్డి వద్ద పోలీసులు 137 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ రైల్వేకోడూరులోని బీసీ హాస్టల్లో ఉంచి వారి స్వస్థలాలకు రైళ్లలో పంపించేందుకు బస్సుల్లో కడపకు తరలించారు. అయితే వీరి నుంచి కోయంబేడు ప్రాంతానికి చెందిన వారిని వేరు చేసి 18 మందిని 14 వ తేదీన కడపలోని క్వారంటైన్‌కు తరలించారు. అనంతరం వీరికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి పాసు తీసుకొని వచ్చిన ఆరుగురిని పోలీసులు క్వారంటైన్‌కు తరలించారు. వారిలో ఒకరికి కరోనా వచ్చినట్లు నిర్ధరణ అయ్యిందని అధికారులు వెల్లడించారు.
కడపలో మరో రెండు పాజిటివ్ కేసులు - koyambedu latest news
కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఇద్దరికీ కరోనా పాజిటివ్ రావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు సమయానికి స్పందించి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్‌కు తరలించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు.

కడపలో మరో రెండు పాజిటివ్ కేసులు