కడప జిల్లా గోపవరం మండలం ప్రాజెక్ట్ కాలనీ వద్ద రెండు లారీలు పరస్పరం ఢీకొన్నాయి. ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కావటంతో ఆసుపత్రికి తరలించారు. రెండు లారీలు రహదారిపై అడ్డంగా ఉండిపోవటంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాహన రాకపోకలను పునరుద్ధరించారు.
రెండు లారీలు ఢీ... ఒకరికి తీవ్ర గాయాలు - recent lorry accident in gopavaram news
రెండు లారీలు పరస్పరం ఢీకొన్న ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కడప జిల్లా గోపవరం వద్ద జరిగింది.

గోపవరంలో రెండు లారీలు ఢీ