Two Killed In A Road Accident In Jammalamadugu: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో ఓ ఇన్నోవా వాహనం బీభత్సం సృష్టించింది. గురువారం రాత్రి ఇన్నోవా జనాల పైకి దూసుకెళ్లడంతో ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. జమ్మలమడుగు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి ముద్దనూరు వైపు నుంచి జమ్మలమడుగు పాత బస్టాండ్ మీదుగా ఓ ఇన్నోవా కారు వేగంగా దూసుకొచ్చింది. ఆ సమయంలో జమ్మలమడుగు పాత బస్టాండ్ వద్ద ఉన్న ఓ ద్విచక్ర వాహనదారుడిని ఆ ఇన్నోవా కారు ఢీ కొనడంతో.. ఆ వాహనాన్ని నడుపుతున్న లక్ష్మయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
Man Dragged By Car : ట్యాక్సీ డ్రైవర్ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు.. మృతదేహాన్ని వదిలేసి పరార్
ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టిన అనంతరం ఆ కారు అంతే వేగంతో ఎక్కడ ఆపకుండా తాడిపత్రి రోడ్డు నుంచి నగర పంచాయతీ కార్యాలయం, కోవెలకుంట్ల బైపాస్ మీదుగా ప్రొద్దుటూరు వైపుగా ఆ వాహనం దూసుకెళ్లింది. ఈ క్రమంలో మరో రెండు వేరువేరు చోట్ల ఇద్దరు వ్యక్తులను ఢీకొంది. ఈ ఘటనలో అశోక్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి మరణించగా.. మరి కొద్ది దూరంలో మరొక వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
Car Killed Pedestrian Video : పాదచారుడిపైకి దూసుకెళ్లిన కారు.. అమాంతం గాల్లోకి ఎగిరి వ్యక్తి మృతి
ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జమ్మలమడుగు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన ఆ ఇన్నోవా కారు అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి శుక్రవారం ఉదయం జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ఈ ఘటనపై ఆయన ఆరా తీశారు.
Lorry Accident in Prakasam District : రోడ్డు పక్కన టీస్టాల్ లోకి దూసుకొచ్చిన లారీ.. ఆ సమయంలో..!
Auto Overturned in Prakasam district: వాహనానికి అడ్డు వచ్చిన కుక్కను తప్పించే క్రమంలో కూలీలను తీసుకువస్తున్న ఆటో బోల్తాపడ్డ ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం వెల్లుపల్లె సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ముగ్గురు వ్యక్తులకి తీవ్రంగా గాయాలు అయ్యాయి. మరో 10 మందికి స్వల్పంగా గాయాల పాలయ్యారు. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులను గిద్దులూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కూలీలతో తీసుకు వెళ్తున్న క్రమంలో తన ఆటోకు కుక్క అడ్డురావటంతో.. దాని తప్పించబోయే క్రమంలో వాహనం అదుపుతప్పి బోల్తాపడిందని ఆటో డ్రైవర్ పోలీసులకు తెలిపాడు.
Three Died In Road Accidents in AP: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి.. ఇద్దరు చిన్నారులు సేఫ్