ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గాలి పంపు విషయంలో వివాదం..ఇరు వర్గాల ఘర్షణ - రైల్వేకోడూరు మండలంలో సైకిల్​ ఘటనపై ఘర్షణ

రైల్వేకోడూరు మండలంలో ఇరువర్గాల మధ్య స్వల్పంగా ప్రారంభమైన ఘర్షణ చిలికి చిలికి గాలి వానగా మారింది. ఇరువర్గాల మధ్య పాతకక్షలు ఉన్నందున దాడులు చేసుకున్నారని స్థానికులంటున్నారు.

two groups fight each other in railway koduru mandal
ఘర్షణలో గాయపడ్డ బాధితుల్లో ఒకరు

By

Published : Jun 8, 2020, 11:27 AM IST

ఈ ఘటన కడప జిల్లా రైల్వే కోడూరు మండలం ఎస్​. కొత్తపల్లిలో గాలి పంపు విరగొట్టాడని ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. స్వల్పంగా మొదలైన ఈ వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. జరిగింది.

గాలి పంపు సాకుతో పాతకక్షలు దృష్టిలో ఉంచుకొని ఇరువర్గాలు రాళ్లతో దాడులు చేసుకున్నాయని స్థానికులు తెలిపారు. ఈ ఘర్షణలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై వెంకట నరసింహం తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details