STUDENTS DEAD: కడప రైల్వే స్టేషన్ పరిధిలోని బాక్రాపేట వద్ద ఇద్దరు విద్యార్థినులు రైలు కింద పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అనంతపురం జిల్లా యాడికి మండలానికి చెందిన పూజిత(19) తాడిపత్రిలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోంది. యాడికికి చెందిన కల్యాణి(19) గుత్తిలోని గేట్ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతోంది. వీరిద్దరూ ఈరోజు బాక్రాపేట సమీపంలో రైలు కింద పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఘటనాస్థలాన్ని కడప రైల్వే పోలీసులు పరిశీలించారు. ఇద్దరి మృతదేహాలను స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
STUDENTS DEAD: రైలు కిందపడి ఇద్దరు విద్యార్థినుల అనుమానాస్పద మృతి - kadapa latest news
STUDENTS DEAD: ఇద్దరు విద్యార్థినులు రైలు కింద పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
two girl students dead