కడప జిల్లా పులివెందులలోని ఓ ప్రైవేట్ స్కూల్కు చెందిన రెండు బస్సులు దగ్ధమయ్యాయి. పాఠశాలకు చెందిన మూడు బస్సులను బేతేలు చర్చి వెనుక పార్కింగ్ చేశారు. ఇందులో రెండు బస్సులలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన స్థానికులు పక్కనే ఉన్న మరో బస్సు అద్దాలు పగలగొట్టి దానిని పక్కకు జరిపారు. దీంతో మూడో బస్సు అగ్ని ప్రమాదం నుంచి బయటపడింది.
పులివెందులలో అగ్నిప్రమాదం..రెండు బస్సులు దగ్ధం - పులివెందులలో రెండు బస్సులు దగ్ధం
పులివెందులలోని ఓ ప్రైవేట్ స్కూల్కు చెందిన రెండు బస్సులు దగ్ధమయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
పులివెందులలో రెండు బస్సలు దగ్ధం
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకోని మంటలను ఆదుపులోకి తీసుకువచ్చారు. కరోనా లాక్డౌన్ కారణంగా బస్సులను మైదానంలో పార్కింగ్ చేశామని స్కూల్ యాజమాన్యం తెలిపింది.
ఇదీ చదవండి