ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆసాదిపల్లి వద్ద బురదలో చిక్కుకుని ఇద్దరు బాలురు మృతి - ఆసాదిపల్లి తాజా వార్తలు

సరదాగా నీటికుంటలో ఈతకు వెళ్లి.. ప్రమాదవశాత్తు బురదలో చిక్కుకుని ఇద్దరు బాలురు మృతి చెందారు. ఈ ఘటన కడప జిల్లా వీరబల్లి మండలం ఆసాదిపల్లి వద్ద జరిగింది.

Two boys were killed when they got stuck in mud at Asadipalli.
ఆసాదిపల్లి వద్ద బురదలో చిక్కుకుని ఇద్దరు బాలురు మృతి.

By

Published : Sep 21, 2020, 3:42 PM IST

కడప జిల్లా వీరబల్లి మండలం ఆసాదిపల్లి వద్ద సోమవారం ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. బట్టలు శుభ్రం చేసుకునేందుకు తల్లితో కలిసి గ్రామ సమీపంలోని నీటికుంట వద్దకు వెళ్లిన విష్ణు (10), సాయి చరణ్ (13) లు మృత్యువాతపడ్డారు. నీటికుంట వద్ద మహిళలు బట్టలు శుభ్రం చేసుకుంటుండగా.. ఆ ఇద్దరు పిల్లలు ఈత కోసం నీటిలోగి దిగారు. సరదాగా ఆడుకుంటున్న పిల్లలు ఇద్దరూ ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో ఆందోళనతో అక్కడున్న వారు గ్రామస్థులకు సమాచారాన్ని అందించారు.

గ్రామస్థులు కుంట వద్దకు చేరుకుని గాలించగా బురదగుంటలో ఇద్దరు పిల్లలు చనిపోయి కనిపించారు. వారిని బయటికి తీశారు. పిల్లల మృతితో తల్లితండ్రుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి వీరబల్లి పోలీసులు చేరుకుని ఆరా తీశారు. మృతదేహాలను శవపరీక్షకై రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి.రాజధాని అంశంపై హైకోర్టులో విచారణ అక్టోబర్ 5కి వాయిదా

ABOUT THE AUTHOR

...view details