కడపలో ప్రవహిస్తున్న బుగ్గవంక వాగులో పడి ఆదివారం ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. వారి కోసం పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు చింతకొమ్మదిన్నె మండలంలోని బుగ్గవంక ప్రాజెక్టు నిండటంతో అధికారులు 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
వాగులో పడి ఇద్దరు బాలురు గల్లంతు - kadapa latest news
ఆడుకోవడానికి వెళ్లిన ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తూ వాగులో పడి గల్లంతయ్యారు. ఈ ఘటన కడపలో జరిగింది. వారి జాడ కోసం అధికారులు గాలిస్తున్నారు.
Two boys missing after fell in buggavanka vagu
ఫలితంగా.. కడప నగరం నడిబొడ్డున ఉన్న బుగ్గవంక వాగుకు వరద పోటెత్తింది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు వాగులో పడి గల్లంతయ్యారు. వీరిలో ఒకరి వయసు 10, మరొకరి వయసు 12 గా స్థానికులు చెప్పారు. చీకటి పడగా గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.