కడప జిల్లా జమ్మలమడుగు కూరగాయల మార్కెట్లో టర్కీ ఉల్లి సందడి చేస్తోంది. ఇటీవల ఉల్లి ధరలు అమాంతంగా పెరగడంవలన ఇక్కడి వ్యాపారులు విదేశాల నుంచి ఉల్లిని తెప్పిస్తున్నారు. ఈజిప్ట్, టర్కీ దేశం నుంచి ఉల్లిపాయలను తెప్పించి కిలో రూ.150ల చొప్పున విక్రయిస్తున్నారు. ఇవి చూసేందుకు పెద్ద సైజులో ఉన్నాయి. ఒక్క ఉల్లి పాయ 330 గ్రాములు బరువు తూగుతోంది. కిలోకు రెండు నుంచి మూడు ఉల్లిపాయలు మాత్రమే వస్తున్నాయి. ఇంత పెద్దగా ఉన్న వీటిని కొనేందుకు ప్రజలు ఆలోచిస్తుండగా.. మరికొంతమంది ధర ఎక్కువైనా వాటినే కొంటున్నారు. పాకిస్తాన్, చైనా, టర్కీ దేశాల్లో పండే వీటికి మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం స్థానికంగా పండే ఉల్లి ధర రూ.100లు ఉండటంతో.. విదేశీ ఉల్లిపాయలను కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారని వ్యాపారులు చెప్తున్నారు.
మీకూ టర్కీ ఉల్లి కావాలా.. ఈజిప్టు ఉల్లి కావాలా..!
ఎవరు మార్కెట్‌కి వస్తే జనం భయపడతారో.. డబ్బులు అయిపోతాయని ఆందోళన చెందుతారో అదే ఉల్లి. మీకు ఇప్పుడు టర్కీ కావాలా..ఈజిప్టు కావాలా.. ప్రాంతాలు కావండోయ్... అక్కడి నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లి.
ఉల్లి కావాలా