దేశ సమైక్యత, సమగ్రత కోసం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, సర్ధార్ వల్లభాయ్ పటేల్ కృషి చేశారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి కొనియాడారు. ఇందిరా 37వ వర్ధంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ 146 వ జయంతిని పురస్కరించుకొని కడప జిల్లా వేంపల్లిలో వారి చిత్రపటాలకు ఆయన నివాళర్పించారు.
565 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి విశాల భారతావని ఆవిర్భవించడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి చేశారన్నారు. ఇందిరా పరిపాలనలో హరిత విప్లవం, బ్యాంకుల జాతీయీకరణ, రాజ భరణాల రద్దు, బంగ్లాదేశ్ విముక్తి , 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం వంటివి అమలయ్యాయన్నారు.