ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్​ది వైఎస్​ఆర్ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ: తులసిరెడ్డి - జగన్​పై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి కామెంట్స్

రైతులను నట్టేట ముంచిన జగన్మోహన్ రెడ్డి సర్కార్​కు పతనం తప్పదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్ రాజశేఖర్​ రెడ్డి తీసుకొచ్చిన ఉచిత విద్యుత్ పథకానికి జగన్ తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు.

జగన్​ది వైఎస్​ఆర్ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ: తులసిరెడ్డి
జగన్​ది వైఎస్​ఆర్ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ: తులసిరెడ్డి

By

Published : Oct 31, 2020, 3:59 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న రైతు బిల్లులు తేనె పూసిన కత్తి లాంటివని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ పేరుగా మార్చారని విమర్శించారు. రైతులు కంటినిండా నిద్ర, కడుపునిండా భోజనం చేస్తూ సంతోషంగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించే ప్రక్రియను ప్రవేశపెట్టడం రైతుల మెడకు ఉరి తాడు అయ్యిందని పేర్కొన్నారు. అప్పటినుంచే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పతనం మొదలైందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక కార్యకలాపాలకు నిరసనగా సత్యాగ్రహ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details