ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'డాక్టర్ సుధాకర్​తో పోలీసుల ప్రవర్తన అమానుషం' - డాక్టర్ సుధాకర్ విషయంపై తులసిరెడ్డి స్పందన

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని ఆగ్రహించారు.

tulasireddy fires on central and state governments
తులసిరెడ్డి

By

Published : May 17, 2020, 1:18 PM IST

విశాఖలో డాక్టర్ సుధాకర్​తో ట్రాఫిక్ పోలీసులు ప్రవర్తించిన తీరు అమానుషమని.. రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. కడప జిల్లా వేంపల్లిలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని మండిపడ్డారు. సుధాకర్ మానసిక పరిస్థితి బాలేదని చెప్తున్నారని.. ఒక వేళ అదే అయితే మానసిక రోగులపట్ల ప్రవర్తించే తీరు అదేనా అని ప్రశ్నించారు. ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేసి, మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.

విద్యుత్ బిల్లులపై మాట్లాడుతూ.. మార్చి, ఏప్రిల్, మే నెలల బిల్లులు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. జులై నెల నుంచి పాత శ్లాబ్ రేట్ల ప్రకారం కరెంట్ బిల్లులు వసూలు చేయాలన్నారు. కేంద్రప్రభుత్వ ప్యాకేజీలపై పెదవి విరిచారు. అది ఆర్థిక ప్యాకేజీ కాదు... విధాన ప్రకటన అని ఎద్దేవా చేశారు. ఆ ప్యాకేజీతో ఎవరికీ ఒరిగేదేమీ లేదన్నారు. అప్పులివ్వడం కాకుండా సాయం చేయాలని సూచించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details