ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అచ్చెన్నాయుడి అరెస్టు రాజకీయ కక్ష సాధింపు చర్యే: తులసిరెడ్డి - తులసిరెడ్డి వార్తలు

మాజీమంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు విషయంలో అధికారులు అమానుషంగా ప్రవర్తించారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. ఇది కచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు చర్యేనని దుయ్యబట్టారు. ఈ విధానాన్ని ప్రజాస్వామ్యంలోని ప్రతి ఒక్కరూ ఖండిచాలన్నారు.

అచ్చెన్నాయుడి అరెస్టు రాజకీయ క్షక్ష సాధింపు చర్యే: తులసిరెడ్డి
అచ్చెన్నాయుడి అరెస్టు రాజకీయ క్షక్ష సాధింపు చర్యే: తులసిరెడ్డి

By

Published : Jun 13, 2020, 3:54 PM IST

మాజీమంత్రి అచ్చెన్నాయుడును అరెస్టు చేసిన విధానం అప్రజాస్వామికమని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. అచ్చెన్న అరెస్టు విషయంలో ఏసీబీ అధికారులు అమానుషంగా ప్రవర్తించారన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా..శస్త్ర చికిత్స చేసుకున్న వ్యక్తిని 300 మంది పోలీసులతో అరెస్టు చేయటం సరైన విధానం కాదన్నారు. ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు అచ్చెన్నాయుడిని అరెస్టు చేయటం అనాగరిమకని మండిపడ్డారు. ఇది కచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు చర్యేనని దుయ్యబట్టారు. ఈ విధానాన్ని ప్రజాస్వామ్యంలోని ప్రతి ఒక్కరూ ఖండిచాలన్నారు.

చమురు ధరల పెంపునకు వ్యతిరేకంగా నిరసన...

పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా కడప జిల్లా వేంపల్లిలో తులసిరెడ్డి నిరసన చేపట్టారు. వాహనానికి తాడు కట్టి లాగుతూ విన్నూత రీతిలో నిరసన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లలో రోజుకు రోజుకు ముడి చమురు ధర తగ్గుతుండగా.. మనదేశంలో ధరలు పెరుగుతుండటం విడ్డూరమన్నారు. యూపీఏ పాలనలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధర బ్యారెల్​కు 140 డాలర్లు ఉన్నప్పటికీ.. లీటర్ పెట్రోల్ రూ. 75 డీజిల్ రూ. 65 లభించేదని తులసిరెడ్డి గుర్తుచేశారు.

ABOUT THE AUTHOR

...view details