జగన్ మేనిఫెస్టోలో దశలవారీగా మద్యపానం నిషేధం అమలు చేస్తామన్నారని, కానీ ప్రస్తుతం అమలవుతున్నది దశలవారీ మద్యపాన నిషా అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు తులసి రెడ్డి దుయ్యబట్టారు. నవరత్నాలలో మద్యపాన నిషేధం కూడా ఒకటి అని కడప జిల్లా వేెపంల్లిలో గుర్తు చేశారు. మద్యం విషయంలో ముఖ్యమంత్రి జగన్ మాట తప్పారని విమర్శించారు. నవరత్నాలలో ఒక రత్నం గులక రాయిగా మారిందన్నారు. అమ్మ ఒడి డబ్బులు నాన్న మందు బుడ్డీకి చాలడం లేదని ఎద్దేవా చేశారు.రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం 2015 - 16లో రూ.4,386 కోట్లు అయితే, 2021 - 22లో రూ.15,000 కోట్లు ఉందని ఆయన అన్నారు.
నవరత్నాలలో ఒక రత్నం గులక రాయిగా మారింది : తులసిరెడ్డి
సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో మద్యపాన నిషేధం కాకుండా, మద్యపాన నిషా అమలవుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం 2015 - 16లో రూ.4,386 కోట్లు అయితే, 2021 - 22లో రూ.15,000 కోట్లు ఉందని ఆయన అన్నారు
తులసీరెడ్డి