రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కడప ఇందిరా భవన్లో పార్టీ నాయకులతో కలిసి ఆయన రిలే దీక్షలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవలే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తింప జేస్తున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అమలు చేయడంలేదని ఆయన విమర్శించారు.
'రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించాలి' - tulasireddy latest news
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ... కడప ఇందిరా భవన్లో పార్టీ నాయకులతో కలిసి తులసిరెడ్డి రిలే దీక్షలు చేపట్టారు.

తులసిరెడ్డి
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విద్యాసంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు వర్తింపజేస్తున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు... రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. విద్యాసంస్థల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పిస్తూ గత ఏడాది జీవో జారీ చేసిన ప్రభుత్వం... ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తామని హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదని ఆయన గుర్తుచేశారు.
ఇదీ చదవండీ... 'ప్రజలకు వైద్యం అందనప్పుడు- ప్రభుత్వం ఉండి ఏం లాభం'