ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కొత్త జబ్బు వచ్చినట్లుందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి ఆరోపించారు. ఇటీవల పదే పదే తన వెంట్రుక కూడా ఎవ్వరూ పీకలేరని జగన్ పదేపదే అంటున్నారన్నారు. బహుశా అయనకు పీకుడు జబ్బు వచ్చినట్లుందని ఎద్దేవా చేశారు. కడప జిల్లా వేంపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
పాపం.. సీఎం జగన్‌కు ఆ జబ్బు వచ్చినట్లుంది: తులసిరెడ్డి
ముఖ్యమంత్రి జగన్పై కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌కు కొత్త జబ్బు వచ్చినట్లు ఉందని ఆరోపించారు. ఈ మధ్య కాలంలో పదే పదే తన వెంట్రుక కూడా ఎవ్వరూ పీకలేరని జగన్ పదేపదే అంటున్నారని... బహుశా అయనకు పీకుడు జబ్బు వచ్చినట్లుందని ఎద్దేవా చేశారు
రెండు నెలల క్రితం నంద్యాలలో విద్యాదీవేన సభలో, నిన్న శ్రీకాకుళం జిల్లాలో అమ్మ ఒడి నిధుల విడుదల కార్యక్రమంలోనూ.. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ముందు సీఎం జగన్ మాట్లాడుతూ.. తన వెంట్రుక ఎవరూ పీకలేరు అని అన్నారని ఆయన తులసి రెడ్డి తెలిపారు. జగన్ వెంట్రుక పీకే తీరిక, అవసరం ప్రతిపక్ష పార్టీలకు లేదన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్‌ను సీఎం పదవి నుంచి పీకేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆ తర్వాత ఆయన వెంట్రుకలు ఆయనే పీక్కుంటూ కూర్చోవల్సిందేనని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: