ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతు సమస్యలు పట్టని ప్రభుత్వం: తులసి రెడ్డి - Tulasi Reddy

కడప జిల్లాలో శనగ రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్​ రైతులకు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారని ఆరోపించారు.

పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి

By

Published : Jul 30, 2019, 5:06 PM IST

పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి

ముఖ్యమంత్రి జగన్ రైతులకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. కడప జిల్లా వేంపల్లిలో తులసిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కడప జిల్లాలో శనగ రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా... గిట్టుబాటు ధర లేక రైతులు పంటలు అమ్ముకోకుండా ఇళ్లలో నిల్వ చేస్తున్నారని పేర్కొన్నారు. వైకాపా అధికారంలోకి వస్తే... క్వింటాకు రూ.6500 చొప్పున ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పిన విషయం గుర్తుచేశారు.

ABOUT THE AUTHOR

...view details