ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్ర విభజనకు ఏడున్నరేళ్లు దాటినా.. ఇప్పటికీ హామీలు అమలు కాలేదు' - రాష్ట్ర విభజనపై ప్రధాని వ్యాఖ్యలు ఖండించిన కాంగ్రెస్

రాష్ట్ర విభజనపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఖండించారు. రాష్ట్ర విభజన జరిగి ఏడున్నరేళ్లు దాటినా ఇప్పటికీ హామీలు అమలు జరగలేదని నేతలు తులసిరెడ్డి, మస్తాన్‌వలీ విమర్శించారు.

Tulasi Reddy Press Meet
Tulasi Reddy Press Meet

By

Published : Feb 10, 2022, 6:03 AM IST

రాష్ట్ర విభజన జరిగి ఏడున్నరేళ్లు దాటినా ఇప్పటికీ హామీలు అమలు జరగలేదని కాంగ్రెస్ పార్టీ నేతలు తులసిరెడ్డి, మస్తాన్‌వలీ విమర్శించారు. ప్రధాని మోదీ ఈ విషయాలు ప్రస్తావించకుండా.. ఎప్పుడో జరిగిన విభజన తీరు గురించి ఇప్పుడు పార్లమెంట్‌లో ప్రసగించడం ఏంటని వారు ప్రశ్నించారు. రాష్ట్ర విభజనపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.

ప్రధానికి తెలుగు రాష్ట్రాలపై అంత ప్రేమ ఉంటే విభజన హామీలు అమలుపరచాలని సూచించారు. రాజధానికి శంకుస్థాపన చేసి..ఇప్పటి వరకు కనీసం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయని వారు ప్రశ్నించారు.

ఇదీ చదవండి:రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల కలెక్టరేట్ల ముట్టడి.. పోలీసుల ముందస్తు అరెస్టులు

ABOUT THE AUTHOR

...view details