రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసి రెడ్డి విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఇంటిలో వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, తన అనుచరులతో కలిసి దాడికి దిగి భయోత్పాతం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ సుపరిపాలన అందిస్తున్న వారు అయితే.. ఎమ్మెల్యేపై క్రమశిక్షణ చర్యలు తీసుకొని, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలు నిదర్శనమని తులసి రెడ్డి అన్నారు. ధర్మవరం స్నేహలత హత్య విషయంలోనూ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తులసి రెడ్డి విమర్శించారు.
ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని సస్పెండ్ చేయాలి: తులసి రెడ్డి
ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసి రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
tulasi reddy on ysrcp mla prabhaker reddy attack on tdp leader jc prabhaker reddy